Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప కోసం బన్నీ ప్లాన్ ఇదే (video)

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (15:10 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కేరళలో షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు కరోనా రావడంతో షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు.
 
చిన్న సినిమాల షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి కానీ.. స్టార్ హీరోల షూటింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే.. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఓ ప్లాన్ రెడీ చేసారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మేటర్ ఏంటంటే... పుష్ప షూటింగ్‌కి బ‌న్నీ రెడీ అవుతున్నాడట. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అడ‌వుల్లో ఈ సినిమా కోసం ఓ ప్ర‌త్యేక‌మైన సెట్ వేస్తున్నారట. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం మ‌రో సెట్ వేస్తున్నారు. అందులో ఓ పాట తెర‌కెక్కిస్తారు.
 
ముందుగా సాంగ్స్ కంప్లీట్ చేద్దామని బన్నీ చెప్పాడట. అందుచేత బన్నీ ప్లాన్ ప్రకారం.. ముందుగా సాంగ్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జులై మొద‌టి వారంలో పాటల చిత్రీకరణతో పుష్ప షూటింగ్ ప్రారంభం కానుంది.
 
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ - సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments