Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ ప్లాన్ అదిరిందిగా..!

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:46 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌తో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఐకాన్ అనే మూవీ చేయనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఈ సినిమా ఉందో లేదో అనేది ఇప్పటికీ సస్పెన్స్.
 
ఇదిలా ఉంటే... బన్నీ ఎప్పటి నుంచో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. సెట్ కావడం లేదు. మెగాస్టార్‌తో కొరటాల ఆచార్య సినిమా చేస్తున్నారు. 
 
ఈ సినిమా పూర్తవ్వడానికి ఆరు నెలలు పట్టచ్చు. అయితే... ఈ సినిమా తర్వాత చరణ్‌తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. తాజాగా బన్నీని కలిసి కథ చెప్పాడని.. బన్నీ వెంటనే ఓకే చెప్పాడని టాక్.
 
అలాగే బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కూడా మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అల.. వైకుంఠపురములో సినిమా సెట్స్ పైన ఉన్నప్పుడే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ సాధించేలా సక్సెస్ సాధించడంతో ఖచ్చితంగా కలిసి మరో సినిమా చేద్దామని త్రివిక్రమ్ బన్నీతో చెప్పారు.
 
ఈ విధంగా బన్నీ పుష్ప సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. బన్నీ.. ప్లాన్ అదిరింది.. ఈ రెండు సినిమాలతో వరుసగా సక్సెస్‌లు సాధిస్తే... బన్నీ క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments