Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ నిజమైన ఐకాన్ స్టార్ ! మరి అల్లు అర్జున్ ?

డీవీ
శనివారం, 22 జూన్ 2024 (16:54 IST)
pawan kalyan
ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఐకాన్ బిరుదు ప్రసాదించాడు దర్శకుడు సుకుమార్. అలాంటి యూత్ ఐకాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలిబెట్టి.. కాదు కాలుపెట్టి చాలా తప్పు చేశాడనే సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి పునాది చిరంజీవి అయితే, తనకు మామయ్య సపోర్ట్ అంటూ మొదట్లో మామయ్య స్పూర్తితో డాన్స్ చేస్తూ కష్టపడి నటుడిగా ఎదిగాడు. 
 
కాలక్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు వచ్చారు. అందులో పవన్ కళ్యాన్ పవర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. ఇవన్నీ అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడని దర్శక నిర్మాత గీతాక్రిష్ణ లేటెస్ట్ గా ఓ వీడియోలో పేర్కొన్నాడు. అల్లు అర్జున్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిత్త్వం నలుగురితో కలిసేది కాదంటూ ఎద్దేవా చేశారు.

 ఇప్పుడు ఐకాన్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. 21 సీట్లలో పోటీచేస్తే 21 గెలిచిన వారు దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్..పవన్ ఆలోచనలు, చేష్టలు నలుగురికి ఆదర్శంగా చెప్పుకొంటున్నారు. 
 
అల్లు అర్జున్ వై.సి.పి. అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై యావత్ తెలుగు దేశంతోపాటు విదేశీయులు కూడా ఆశ్చర్యపోయారు. కుటుంబంలో ఎన్ని గొడవలైనా వుండొచ్చు. కానీ ఆపత్కారలంలో ఒక్కటి కావాలి. అలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళుగా పోరాడుతుంటే ఆయనకు మద్దతు ఇవ్వకపోగా ఆంధ్ర అంతా నాశనం చేసిన పార్టీకి వత్తాసుపలకడంలో అంతర్యం ఏమిటి? ఈ ఎఫెక్ట్..పుష్ప 2 సినిమా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఆ సినిమాలో పాటలు బాగోలేవని సోషల్ మీడియాలో  తెగ ట్రోలింగ్ లుజరుగుతున్నాయంటూ తెలిపారు. సో.. ఫైనల్ గా ముద్రగడ పద్మనాభం లా అల్లు అర్జున్ తయారడనే టాక్ కూడా ఇండస్ట్రీలో నెలకొంది సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments