Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక పారితోషికం.. ప్రభాస్‌ను వెనక్కి నెట్టి పుష్ప స్టార్!

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (10:23 IST)
అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకునే తెలుగు స్టార్‌గా ప్రభాస్‌ను ఓడించాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో హిందీలో అరంగేట్రం చేసినందుకు అల్లు అర్జున్ 125 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. ఒక్కో సినిమాకు ప్రభాస్ పారితోషికం రూ.100 కోట్లను పుష్ప స్టార్ అల్లు అర్జున్ బ్రేక్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. 
 
సందీప్ రెడ్డి వంగాతో హిందీ సినిమాతో అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకునే దక్షిణాది సినిమా హీరోగా నిలిచాడు. సందీప్ వంగాతో అల్లు అర్జున్ పాన్-ఇండియన్ హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాని కోసం అతను రికార్డ్ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఈ రెమ్యునరేషన్‌తో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాలీవుడ్ నటుడిగా ప్రభాస్‌ను వెనక్కి నెట్టాడు బన్నీ. 
 
ఆర్ఆర్ఆర్ స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత కొత్త ఒప్పందాలు చేసుకోలేదు. ప్రస్తుతం వారి పాత కమిట్‌మెంట్‌ల చిత్రాలలో పనిచేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి ఒక్కొక్కరికి గానూ 75 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. మరి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్‌లో రెమ్యునరేషన్ ఎంత వరకు పెంచుతారో రానున్న రోజుల్లో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments