Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్ష‌న్‌లో నాగార్జున‌... అస‌లు ఏమైంది..?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (20:38 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 సినిమా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. సినిమా హిట్టు ఫ్లాపు అనేది స‌ర్వసాధార‌ణం. అయితే... ఈ సినిమా అంత‌కుమించి అన్న‌ట్టుగా ఎప్పుడూ లేనంత‌గా నాగార్జున‌.. ఇలాంటి సినిమా చేసాడేంటి అనే కామెంట్స్ వ‌చ్చాయి. దీంతో బాగా ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట నాగ్. 
 
ఈ సినిమా త‌ర్వాత సోగ్గాడే చిన్నినాయ‌నా సీక్వెల్ బంగార్రాజు చేయాల‌న‌కున్నాడు. క‌థ రెడీ అయ్యింది. తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు సిద్ధంగా ఉన్నాడు. నిర్మించేందుకు అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా సిద్ధ‌మే కానీ... ఎందుక‌నో సెట్స్ పైకి వెళ్ల‌డం లేదు. కార‌ణం ఏంటంటే... నాగార్జున ఈ సినిమా చేయ‌డం క‌రెక్టా..? కాదా..? అని బాగా ఆలోచిస్తున్నాడ‌ట‌. 
 
ఎందుకంటే... ఇటీవ‌ల కాలంలో నాగార్జున న‌టించిన సినిమాలు స‌క్స‌స్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనాస‌రే.. మంచి హిట్టు మూవీ చేయాలి అనుకుంటున్నాడ‌ట‌.
 
 అందుక‌నే ఆచితూచి అడుగులు వేస్తున్నాడట‌. ఇటీవ‌ల ఓ యువ ర‌చ‌యిత సోల్మాన్ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ నాగ్‌కి బాగా న‌చ్చింద‌ట‌. బంగార్రాజు క‌న్నా.. ముందుగా ఈ సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. దీంతో అస‌లు బంగార్రాజు ఉందా.? లేదా..? అనే టెన్ష‌న్ అభిమానుల్లో మ‌ళ్లీ మొద‌లైంది. మ‌రి... నాగ్ త్వ‌ర‌లోనే నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments