Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌లాయ‌ళ చిత్రంలో నాగార్జున‌.. ఎవ‌రితో క‌లిసి న‌టిస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆఫీస‌ర్ అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అలాగే నానితో చేస్తోన్న మల్టీస్ట

Webdunia
సోమవారం, 7 మే 2018 (19:14 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆఫీస‌ర్ అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అలాగే నానితో చేస్తోన్న మల్టీస్టారర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సార‌ధి స్టూడియ‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఇదిలాఉంటే... లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. నాగ్ రీసెంట్‌గా ఒక డిఫెరెంట్ సినిమాలో కీలక పాత్రకు ఓకే చేశాడట. అది కూడా ఒక మలయాళ సినిమాకు అని తెలుస్తోంది. ఈ మూవీని సీనియర్ డైరక్టర్ ప్రియదర్శన్ తెర‌కెక్కించ‌నున్నారు. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహన్ లాల్ న‌టించే ఈ సినిమా టైటిల్ మరాక్కర్: అరబికాడాలింటే సింహం. త్వరలోనే సినిమాను స్టార్ట్ చేయాలనీ దర్శకుడు ప్లాన్స్ వేస్తున్నాడు. 
 
అయితే... ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగార్జునని ఫైనల్ చేశారట. క‌థ విని నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే మరో మెయిన్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments