Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కి నిర్మాతలు కావాలి, రంగంలోకి దిగిన రామ్ చరణ్‌

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కరోనా రాకుండా ఉంటే, ఈపాటికే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలావుంటే.. అఖిల్ - సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
 
దీనికి కారణం ఏంటంటే... ఈ మూవీకి దాదాపు 40 కోట్లు బడ్జెట్ కావాలట. ముందుగా ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన క్రిష్ నిర్మించాలి అనుకున్నారు కానీ.. అఖిల్ పైన అంత బడ్జెట్ వర్కవుట్ కాదని తప్పుకున్నారు.
 
 ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ మూవీని నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లు కూడా ఆలోచనలోపడ్డారని టాక్. కథ నచ్చింది... డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెడీగా ఉన్నారు కానీ.. ఈ సినిమాకి డబ్బులు పెట్టే నిర్మాతే లేడు.
 
అందుకనే అసలు విషయం తెలుసుకున్న రామ్ చరణ్... అఖిల్ కోసం రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాని సెట్ చేసే పనిలోనే ఉన్నారని... త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ వస్తుందని తెలిసింది. మరి.. అఖిల్ కోసం రిస్క్ చేసే ఆ ప్రొడ్యూసర్ ఎవరో..? ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments