Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ గెడ్డం ఎందుకు పెంచుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు... అందుకే మాధవీలత

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:57 IST)
పవన్ కళ్యాణ్ గెడ్డం ఎందుకు పెంచుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. పింక్ రీమేక్ చిత్రంలో అలాంటి గెటప్ వేసేందుకే అలా పెంచుతున్నారా అనుకుంటే... అది కాదని అర్థమవుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి గెడ్డం పెంచుకుని తిరుగుతున్నారు. దీనిపై సినీ నటి మాధవీలత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులకు రిక్వెస్ట్ చేసింది. ఇంతకీ ఏం చేసిందో చూడండి.
 
" పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా ఆ కళ్ళు, ఆ ముఖం. ఈ మధ్య ఆయన పూర్తిగా గెడ్డంలో ముఖం దాచుకుంటే అభిమానులు ఇంకా ఏమి చూడాలి? ముఖం చూసే భాగ్యం ఐనా దక్కితే చాలు అనే అభిమానులు ఉన్నారు. అలా గెడ్డంలో ముఖం దాచొద్దు అండి. మాలాంటి వాళ్ళు కళ్ళు ముఖం పూర్తిగా ఒకసారి చూసి ఐనా ఆనందం పొందుతాం.
 
పైగా మీరు మంచి లీడర్. చక్కగా ఉండండి. గెడ్డం బాగా నచ్చింది అనుకుంటే నరేంద్ర మోడీ గారిలా నీట్ ట్రిమ్‌లో ఉండండి. ఏమైనా సరే మీరు నీట్ షేవ్‌లో ఉంటేనే బాగుంటది. ఎలా ఉన్నాం అన్నది కాదు... చేసే పని ముఖ్యం అనే సోది చెప్పొద్దూ.

ఫాన్స్ మీకు కూడా కళ్యాణ్ గారు కళ్ళనిండా కనపడితే నచ్చుతాడు కదా.... లీడర్స్ అంటే చూడటానికి నీట్‌గా ఉండాలి. వర్క్ కూడా నీట్‌గా చేయాలి. ఏదో మా అభిమానం" అని పేర్కొంది. మరి మాధవీలత రిక్వెస్ట్ చూసైనా పవన్ కళ్యాణ్ గెడ్డం షేవ్ చేసుకుని ట్రిమ్‌గా కనబడతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments