Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలెక్కనున్న అంజలి... నిజమేనా? (video)

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (14:01 IST)
దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను కలిగివుంది. అయితే, ఈ ముద్దుగుమ్మ గతంలో కోలీవుడ్ యువ హీరోతో ప్రేమలోపడింది. ఆ తర్వాత లవ్ బ్రేకప్ అయింది. పిమ్మట తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాతతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆమె కొన్ని రోజులు పాటు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఇటీవల పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం. 
 
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. అంజలికి వివాహం చేసేందుకు ఆమె బంధువులు ఓ నిర్ణయానికి వచ్చి మంచి వరుడిని చూసినట్టు సమాచారం. ఆ కుర్రోడు కూడా తెలుగు యువకుడనే ప్రచారం సాగుతోంది. వీరి వివాహం కూడా తెలుగు సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్టు వినికిడి. అయితే, ఈ వార్తలను అంజలి లేదా ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు, అంజలి హీరో రామ్ చరణ్ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments