Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్రహ్మోత్సవం' నైజాం రైట్స్... రూ.16 కోట్లు... దిల్ రాజుకు మొండిచేయి!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:47 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. 'శ్రీమంతుడు' తర్వాత విడుదలవుతున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియోను మే 7న హైదరాబాద్‌లో జరిపేందుకు దర్శకనిర్మాతలు నిశ్చయించారు. 
 
అలాగే ఈ సినిమాను మే 20న విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్టు సమాచారం. దీంతో చిత్రానికి నైజాంలో తీవ్రంగా పోటీ ఏర్పడింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం నైజాం హక్కుల కోసం పోటీపడినప్పటికి అభిషేక్ పిక్చర్స్ రూ.16 కోట్లకు దక్కించుకుంది. ఇంతకుముందు మహేష్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ప్రతినిధులే నైజాంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు రూ.14 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకు వచ్చినప్పటికీ దానికంటే ఎక్కువగా చెల్లించి అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి స్వయంగా తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments