Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు మాజీ ప్రేమికులతో తంటాలు.. ప్రభాస్‌తో నటన అందుకేనని అధ్యయన్ ట్వీట్.. పచోలీ ఫైర్!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:37 IST)
బాలీవుడ్ అందాల సుందరి కంగనా రనౌత్‌కు మాజీ ప్రేమికులతో తిప్పలు తప్పట్లేదు. నిన్నటికి నిన్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్‌తో కేసు వివాదంతో కంగనా అష్టకష్టాలు పడుతుంటే.. ప్రస్తుతం కంగనా రనౌత్ మాజీ లవర్ అధ్యయన్ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా రనౌత్ ప్రభాస్‌తో తెలుగు మూవీ చేసేందుకు డబ్బే కారణమని అధ్యయన్ సుమన్ బైటపెట్టేశాడు. 
 
డబ్బుల్లేకపోవడంతో సౌత్‌లో కంగనా సినిమా చేసిందని.. భారీ పారితోషికం కోసం ఆమె ప్రభాస్‌తో నటించిందని అధ్యయన్ తెలిపాడు. ఇక జష్న్ మూవీలో అధ్యయన్ చేసిన నటనను చూసి తన తండ్రి శేఖర్ సుమన్ ఉప్పొంగిపోయారని.. ఈ క్రమంలో తన బర్త్ డే రోజున బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారును కానుకగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కారును చూపించి కంగనాకు సర్‌ప్రైజ్ ఇచ్చానని.. అయితే కంగనా వేసిన ప్రశ్నతో ఖంగుతిన్నానని తెలిపాడు. జీవితంలో ఏం సాధించావని నీకు కోటి రూపాయల కారును గిఫ్ట్‌గా ఇచ్చారని కంగనా అడిగినట్లు అధ్యయన్ తెలిపాడు. 
 
అయితే ఏక్ నిరంజన్ సినిమాలో నటించినందుకు వచ్చిన డబ్బుతో తన బీఎండబ్ల్యూ 7 సిరీస్ వంటిదే ఆమె కొన్నదని చెప్పాడు. ఫ్యాషన్ సినిమాకు అవార్డులు అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె చేతిలో సినిమాలు లేకపోవడాన్ని గ్రహించానని.. తద్వారా కంగనా ఒత్తిడికి గురైన మాట కూడా వాస్తవమేనని అధ్యయన్ ట్విట్టర్ ద్వారా చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
అయితే అధ్యయన్ ట్విట్టర్ వ్యాఖ్యలపై ఆదిత్య పచోలీ మండిపడ్డారు. కెరీర్‌లో స్వతహాగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న కంగనా రనౌత్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని బాలీవుడ్ నటుడు ఆదిత్య పచోలీ ఫైర్ అయ్యారు. కంగనాపై అధ్యయన్ ట్వీట్స్‌పై పచోలీ మీడియా ముందు ఫైర్ అయ్యారు. అధ్యయన్ ఎవరు? అతడిని మీడియా ఉన్నప్పుడే నా ముందుకు తీసుకురండి.. అతనితో ఫేస్ టు ఫేస్‌ మాట్లాడేందుకు రెడీగా ఉన్నానని వార్నింగ్ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments