Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ కథ మధ్యలో ఛేంజ్ చేశారా? జనవరి 10న కలిసిరాలేదా?

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (14:17 IST)
Gamchanger previous poster
సినిమారంగంలో షూటింగ్ కూ రిలీజ్ కూ ముహూర్తాలు పెట్టడం పరిపాటే. ఇందుకు చాలా కసరత్తు చేస్తుంటారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ గురించి టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. సినిమా ప్రారంభంలో చిత్ర టీమ్ అంతా సూట్ బూట్ తో విడుదల చేసిన పోస్టర్ బాగా అట్రాక్ట్ చేసింది. కానీ విడుదల తర్వాత మొత్తం సీన్ మారిపోయినట్లుగా వుంది. దీన్ని బట్టి చూస్తే ముందు అనుకున్న కథను మధ్యలో మార్చేశారా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక సోషల్ మీడియాలో పలు వార్తలు వ్యాపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్ధంతో చూసేలా కొంతమంది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ గురించి చర్చపెట్టారు. ఇందుకు జనవరి 10 రిలీజ్ డేట్ నాడు విడుదల చేయడం సినిమా రంగానికి కలిసిరాలేదని చెబుతున్నారు.
 
గతంలో పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి, మహేష్ బాబు నటించిన ఒన్.. సినిమా కూడా జనవరి 10న విడుదలయి డిజాస్టర్ చవిచూశాయి. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా అదే రోజు విడుదలై ఫెయిల్ అయినట్లు కథనాలు రాసేస్తున్నారు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు ఈ కామెంట్లను కొట్టిపారేస్తున్నారు. అయినా కొందరు అత్యుత్సాహంతో కొందరిని సంప్రదించి చర్చలు పెట్టడం సోషల్ మీడియా వంతైంది. గతంలో సినిమాలు తీసిన త్రిపురనేని చిట్టిబాబు సోషల్ మీడియా కామెంట్లను తప్పుపట్టారు. అదేరోజు విడుదలైన కొన్ని సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. అయితే దర్శకుడు శంకర్ గురించి తన సినిమా గురించి దిల్ రాజుకు ముందుగానే తెలియబట్టే ప్రమోషన్ ను పెద్దగా పట్టించుకోలేదని వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా సినిమాల్లో సరైన పట్టు వుంటే చిన్న పెద్ద సినిమాలు తేడా లేకుండా సక్సెస్ అయిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చిట్టిబాబు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Conductor: ఛార్జీల వివాదం-రిటైర్డ్ ఐఏఎస్‌పై కండెక్టర్ దాడి.. (video)

Kerala: టీనేజ్ అథ్లెట్‌పై కోచ్‌, క్లాస్‌మేట్ల అత్యాచారం.. దాదాపు ఐదేళ్లలో 60మంది?

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ మందా జగన్నాథం

అంద విహీనంగా మారిన 'సిటీ ఆఫ్ ఏంజెల్స్' - కార్చిచ్చును ఆర్పేందుకు నీటి కొరత - మృతులు 24

తెలుగు లోగిళ్ళలో భోగి మంటలు.. మొదలైన సంక్రాంతి సంబరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments