Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్పీ కంట నీరు తెప్పించిన అభిమాని లేఖ.. ఎందుకంటే?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పింక్‌. సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు తక్కువ వసూళ్లు సాధించినా.. క్రమంగా పుంజుకొంది. ఆకలి మీద ఉన

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (12:21 IST)
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం  పింక్‌. సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు తక్కువ వసూళ్లు సాధించినా.. క్రమంగా పుంజుకొంది. ఆకలి మీద ఉన్న పులికి ఆహారం దొరికితే ఎంత ఆబగా వేటాడుతుందో... ఎంత కసిగా తింటుందో... ఎన్నో ఏళ్ల నుంచి తన సామర్ధ్యానికి తగ్గ పాత్ర దొరక్క తెగ ఆకలి మీదున్న ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీకి "పింక్" చిత్రం ఆకలి తీర్చింది. 
 
"పింక్ " చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు లభిస్తుండటంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది తాప్సీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రంలో తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వసూళ్లు కూడా రోజు రోజుకి పుంజుకుంటున్నాయి. దాంతో పింక్ చిత్ర నిర్మాత సూజిత్ సర్కార్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. సూజిత్ సర్కార్ దర్శకత్వంలో ఈ చిత్రంలో సమాజంలో నేటి మహిళలు ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా తీశారు. 
 
అయితే, ఈ సినిమా చూసి చలించిపోయిన ఒక యువతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాప్సీకి లేఖ రాసింది. ''డియర్ తాప్పీ... మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేనెవరో మీకు చెప్పే ముందు ఈ లేఖ ఎందుకు రాస్తున్నానో చెప్పాలి. మీరు నటించిన పింక్ సినిమా చాలా బాగుంది. ఎప్పుడూ పద్ధతులు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఒక మధ్య తరగతి కుటుంబంలో నేను పుట్టిపెరిగాను. చదువు నిమిత్తం ఢిల్లీకి వచ్చినప్పుడు.. జీవితమంటే కేవలం విలువలు, పద్ధతులు మాత్రమే కాదన్న విషయాన్ని తెలుసుకున్నాను. 
 
ఈ సినిమాలో చూపించిన సంఘటనలే మనం జీవితంలో ఎదుర్కొని ఉంటాం. కానీ, ఎంతమంది దీనిని సమర్ధంగా ఎదుర్కోగలిగారు?తాప్పీ, మీకు అది కేవలం పాత్ర మాత్రమే కావొచ్చు. కానీ, ఆ ఒక్క పాత్రతో ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికిప్పుడు ఆడపిల్లల్లో మార్పు రాకపోవచ్చు. కానీ, ఆ మార్పునకు మీరు శ్రీకారం చుట్టారు'' అంటూ ఆ యువతి ఆ లేఖలో పేర్కొంది. కాగా ఈ లేఖకు స్పందించిన తాప్పీ.. ఈ లేఖ తన చేత కన్నీరు పెట్టించిందని చెప్పారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments