Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2 కోసం రానా బాగా పెంచాడు.. ఆన్‌లైన్‌లో వైరలైన బాహుబలి-2 యానిమేటెడ్ టీజర్‌

బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా కోసం బాడీని బాగా పెంచానని.. తన బాడీ ఫోటోనీ రానా ట్విట్టర్లో పోస్టు చేసి, అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం బాగా కష్టపడ్డానని రానా చెప్తున్నాడు.

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (11:53 IST)
బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా కోసం బాడీని బాగా పెంచానని.. తన బాడీ ఫోటోనీ రానా ట్విట్టర్లో పోస్టు చేసి, అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం బాగా కష్టపడ్డానని రానా చెప్తున్నాడు. కోచ్ కునాల్ గిర్ పర్యవేక్షణలో రోజూ రెండున్నర గంటల పాటు ఇందుకోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, బాహుబలి -2 లో తన షెడ్యూల్ భిన్నంగా ఉండడంతో కార్డియో, వెయిట్ ట్రైనింగ్ లో వేర్వేరు రకాల శిక్షణ తీసుకుంటున్నట్టు రానా వెల్లడించాడు. 
 
బాహుబలి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో మరింత ఫిట్‌గా రానా కనిపిస్తాడు. బాహుబలి మొదటి భాగంలో 108 కిలోల నుంచి 110 కిలోల బరువు ఉండగా..రెండో భాగం కోసం సుమారు 93 కిలోలకు బరువు తగ్గాడట. రానా డైట్‌ను కునాల్ ప్రిపేర్ చేశాడని, నూనె లేకుండా ప్రతి రెండున్నర గంటలకోసారి పోషకాహారం తీసుకుంటున్నాడని తెలిసింది.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి 2ను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్‌ 30న జరిగిన ప్రెస్‌మీట్‌లో అక్టోబరు 1న బాహుబలి-2 యానిమేటెడ్ టీజర్‌ను విడుదల చేస్తామని జక్కన్న ప్రకటించాడు. దానికి తగినట్టే అక్టోబర్ ఒకటో తేదీన  ‘బాహుబలి- ద లాస్ట్ లెజెండ్స్’ అంటూ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్కా మీడియా వర్క్స్, గ్రాఫిక్ ఇండియా, అమెజాన్ ప్రైమ్‌లు కలిసి ఆ వీడియోను విడుదల చేశాయి. 
 
ఈ టీజర్ విడుదలపై జక్కన్న ట్వీట్ చేశాడు. ఇప్పటిదాకా ఏ వాణిజ్య సంస్థ చేయని కొత్త ప్రయోగాన్ని చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించి అక్టోబరు 5న మరో గిఫ్ట్ ఇస్తానని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఆ రెండో గిఫ్ట్ వచ్చే వరకు బాహుబలి అభిమానులకు ఈ టీజర్‌తో పండగే. అక్టోబరు 22న మరో సస్పెన్స్ గిఫ్ట్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments