Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్‌పై కన్నేసిన దిల్‌రాజు.. మలయాళ కుట్టి చేతికి చిక్కేనా?

సక్సెస్‌ ఎక్కడుంటే అక్కడికి ఈగల్లాగా నిర్మాతలు వచ్చేస్తుంటారు. ముఖ్యంగా దిల్‌రాజు. కొత్త హీరోయిన్లను అందులోనూ సెంటిమెంట్‌పరంగా లక్కీ అనుకున్నవారికే ఆఫర్లు ఇస్తుంటారు. కొత్తవారైనా.. వారిని చూసి ఫేస్‌రీ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (16:03 IST)
సక్సెస్‌ ఎక్కడుంటే అక్కడికి ఈగల్లాగా నిర్మాతలు వచ్చేస్తుంటారు. ముఖ్యంగా దిల్‌రాజు. కొత్త హీరోయిన్లను అందులోనూ సెంటిమెంట్‌పరంగా లక్కీ అనుకున్నవారికే ఆఫర్లు ఇస్తుంటారు. కొత్తవారైనా.. వారిని చూసి ఫేస్‌రీడింగ్‌ కూడా చెప్పేగలడని సన్నిహితులు అంటుంటారు. అయితే తాజాగా.. ఆయన ఓ హీరోయిన్‌పై కన్నేశాడు. నితిన్‌తో 'అ..ఆ..' అంటూ జోడి కట్టిన అనుపమ పరమేశ్వరన్‌.
 
ఆ సినిమా సక్సెస్‌గా నిలవడడం.. హీరోయిన్‌కు పేరుకూడా రావడంతో.. ఆమెను తన తదుపరి చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆమెతో ఫొటో షూట్‌ కూడా చేయించాడు. ఇప్పటికే మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్న దిల్‌రాజు.. ఈమెతో తీయబోయే సినిమా ఈ ఏడాది ఆఖరులోనే వుంటుందట. 
 
శర్వానంద్‌ హీరోగా.. సతీష్‌ దర్శకత్వంలో రూపొందున్న చిత్రం కోసం ఆమెను ఎంపికచేసినట్లు తెలిసింది. మలయాళంలో 'ప్రేమమ్‌'లో ఆమె నటించింది. సెంటిమెంట్‌పరంగా అది కూడా ఆమెకు వర్కవుట్‌ అయింది. కాగా, బెల్లంకొండ సురేష్‌ తన కొడుకుతో బోయపాటి శ్రీనుతో తీయబోయే సినిమాకు అనుపమను అనుకున్నారు. కానీ ఎందుకనో వర్కవుట్‌ కాలేదని తెలిసింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments