Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌ గారూ.. ఆ తలకాయ సంగతేంటి? షర్మిల ప్రశ్న

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు అనేక ప్రశ్నలు సూటింగా సంధించారు. 
 
'ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేసీఆర్‌ రోజూ అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని, కనీసం 30 మందికి కూడా ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములనూ లాక్కుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేదు కదా..! తల నరుక్కుంటానన్న కేసీఆర్‌.. ఆ తలకాయ సంగతేంటో చెప్పండి? అంటూ నిలదీశారు. 
 
దళితులపైన, గిరిజనులపైన దాడులు జరిగితే కేసీఆర్‌ రాక్షసానందం పొందుతారో ఏమో నాకు తెలియదు. ఇసుక లారీల కింద తమ పిల్లలు చనిపోతున్నారని మొరపెట్టుకుంటే వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. మొన్న మరియమ్మ అనే దళిత మహిళను లాక్‌ప్‌లో చంపేశారు. అంతకుముందు పోడు భూముల కోసం గిరిజన మహిళ పోరాటం చేస్తే బట్టలూడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారని ఆరోపించారు. 
 
ఇదీ.. కేసీఆర్‌ దొరకు ఎస్సీ, ఎస్టీలపై ఉన్న గౌరవం. సమాజంలో ఉన్నవారినే పట్టించుకోని కేసీఆర్‌.. అడవుల్లో ఉండే ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తారా? వారి మాన, ప్రాణాలకు, జీవితాలకు రక్షణ లేదు.. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్‌లు ఇస్తానని చెప్పి ఓట్లు గుంజుకుని మోసం చేశారు' అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments