Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు-కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చెయ్

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:20 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదిక నిలదీశారు వైఎస్ షర్మిల.. కరోనా వైద్యం కోసం ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను భర్తీ చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ట్విట్టర్‌లో స్పందించిన ఆమె.. కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ చెయ్ అంటూ తెలంగాణ యాసలో కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. 
 
755 అంటూ కొసరకు కేసీఆర్ దొర... హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 23,512 ఖాళీ పోస్టులను నింపు జర అని వ్యాఖ్యానించిన ఆమె.. అలా చేస్తే.. నిరుద్యోగుల చావులను కొంతమేరకైనా ఆపవచ్చు అని సలహా ఇచ్చారు.
 
కాగా, తెలంగాణలో వెంటనే 1.91లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షకు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆది నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు షర్మిల.
 
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు వేస్తున్నారు. కోవిడ్ టైంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తిచూపిస్తున్నారు. తెలంగాణలో వెంటనే 1.9 1లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిడ్ బారిన పడటంతో ప్రజాసమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.
 
అయితే తెలంగాణ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సందించేందుకు తాను ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ''రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దొర కేసీఆర్‌కు పట్టింపు లేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సారుకు కనపడటం లేదు'' అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు. 
 
హెల్త్ డిపార్ట్ మెంట్‌లో ఉన్న 23512 ఖాళీపోస్ట్‌లను నింపు జర అంటూ నిరుద్యోగానికి షర్మిల లింక్ పెట్టారు. అవి నింపితే ప్రజల ప్రాణాలతో పాటూ నిరుద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారంటూ కేసీఆర్‌కు షర్మిల ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments