Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో విషాదం.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (19:09 IST)
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. డాక్టర్ పూర్ణ చందర్(28) గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందారు. బుధవారం ఉదయం డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి బయటకు వస్తుండగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది తక్షణమే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయినప్పటికీ అతను వైద్యానికి సహకరించలేదు. గుండెపోటుతో పూర్ణ చందర్ మరణించినట్లు సీనియర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్టర్ పూర్ణచందర్ జనరల్ సర్జరీలో ఇటీవలే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్ణ చందర్ గాంధీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే డాక్టర్ పూర్ణ చందర్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తోటి జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఛాతీలో నొప్పి వస్తుందని, కడుపుంతా వికారంగా ఉన్నట్లు పూర్ణచందర్ తెలిపినట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడని, బుధవారం మళ్లీ విధుల్లో చేరారని జూడాలు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments