కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు: రేవంత్‌తో ధర్మపురి సంజయ్ భేటీ

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (19:07 IST)
టీఆర్ఎస్, బీజేపీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని బలపర్చడానికే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నానని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరతానన్నారు.
 
రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మాట్లాడిన సంజయ్..తన తండ్రి డీఎస్ కోసం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నానని చెప్పారు. కానీ అది కండువా కాదు.. గొడ్డలి అని తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీయే కాదన్నారు. కడుపులో కోపం ఉన్నా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తన తమ్ముడు ఏ పార్టీలో ఉంటే.. తనకేంటి అని అన్నారు.
 
బీజేపీకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. బీజేపీని వీడడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు. మరో బీజేపీ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు కూడా ఆ పార్టీని వీడనున్నారు. రేవంత్‌తో కలిసి టీడీపీలో పనిచేశానని.. మంచిరోజు చూసి.. నియోజక వర్గంలో సభ పెట్టి కాంగ్రెస్ లో చేరతామన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments