Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూస్తుండగానే గోదావరిలో దూకిన యువకుడు, పరుగులు పెట్టిన పోలీసులు...

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (18:15 IST)
గౌతమి గోదావరిలో మునిగిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని ప్రాణాలకు తెగించి భారీ వర్షంలోనూ కాపాడి మరోమారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆలమూరు పోలీసులు.

వివరాల్లోకి వెళితే రంగంపేటకు చెందిన కోటిపల్లి నవీన్ ద్విచక్రవాహనంపై రావులపాలెం వైపు నుండి జొన్నాడ వైపు గౌతమి పాత బ్రిడ్జిపై వస్తూ తన ద్విచక్ర వాహనాన్ని ఆపి అకస్మాత్తుగా బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకగా అటువైపు గస్తీ తిరుగుతున్న ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్‌తో పాటు హైవే పోలీస్ పెట్రోలింగ్ పైలెట్ జీ.వీ.వీ.ఎస్.మూర్తి, హెచ్ సీ ఆర్ఎస్వి రాజులు సంఘటనను గుర్తించి హుటాహుటిన గోదావరి గట్టుకు చేరుకొని భారీగా కురుస్తున్న వర్షంలో నావపై వెళ్లి ప్రాణాలకు తెగించి గోదావరి మధ్యలో మునిగిపోతున్న నవీన్ ను కాపాడగలిగారు.

అయితే పాత కొత్త బ్రిడ్జిపై వెళ్తున్న ప్రయాణీకులు జరుగుతున్న సంఘటనను ఉత్కంఠగా పరిశీలించారు. కాగా నవీన్ విశాఖ డైరీలో పని చేస్తున్నట్లు తెలియవచ్చింది. పోలీసుల్లో మానవత్వము ఉందంటూ పలువురు  పోలీసులను కొనియాడారు. కాగా నవీన్ గోదావరిలోకి దూకడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments