Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:55 IST)
పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు. వివరాల్లోకి వెళితే.. యాద్రాద్రి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన పసికందుకు జన్మనిచ్చింది ఓ యువతి.. ఆ తర్వాత 10 రోజులకు పసికందును రూ. 60 వేలకు భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర విక్రయించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి అమ్మేశారు.
 
అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కాకుండానే.. బిడ్డను జన్మనిచ్చింది ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతం నివాసం ఉండే సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం ద్వారానే గర్భం దాల్చిన యువతి పసికందుకు జన్మనివ్వడం ఆ తర్వాత అమ్మేయడం జరిగిపోయాయి. 
 
కానీ, కేసు విచారణలో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తేవాలని కోరారు నేరేడ్‌మెట్ పోలీసులు.. దీంతో.. పాప చనిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు.. కాస్త గట్టిగా నిలదీయడంతో పోలీసుల విచారణలో పాపను విక్రయించినట్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. పాపను చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments