Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినులతో హెచ్ఎం అసభ్య ప్రవర్తన - చితకబాదిన గ్రామస్థులు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. తన వద్ద చదువుకునే విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో గ్రామస్థులంతా కలిసి హెచ్ఎంను పట్టుకుని చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను స్కూలు ఉపాధ్యాయులు ఈ నెల 18వ తేదీ "గాంధీ" అనే చిత్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సలాది రామారావు విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను సగం తాగిన కూల్‌డ్రింక్‌ను విద్యార్థినిలు తాగాలని బలవంతం చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత హెచ్ఎం తమ పట్ల నడుచుకున్న తీరుని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. 
 
దీంతో వారు ఆగ్రహోద్రక్తులై గ్రామస్థులతో కలిసి హెచ్ఎంను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. సమాచారం, తెలుసుకున్న పోలీసులు గ్రామంలోని సర్పంచ్ ఇంటికి చేరుకుని హెచ్ఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలోనూ ఆయన్ను అడ్డుకుని, మరోమారు చితకబాదారు. 
 
చివరకు హెచ్ఎంను పోలీసులు జాగ్రత్తగా ఠాణాకు తరలించారు. అయితే, రామారావు తమ గ్రామంలో పని చేయడానికి వీల్లేదని గ్రామస్థులు తెగేసి చెప్పారు. దీంతో డిప్యుటేషన్‌పై వేరే ప్ర్రాంతానికి వెళ్తానని లేదంటే సెలవులో ఉంటానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. మరోవైపు, ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

తర్వాతి కథనం
Show comments