Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో రోడ్లు అస్తవ్యస్తం: అద్దంలా మారుస్తున్న జీహెచ్ఎంసి

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (09:45 IST)
గ్రేటర్ హైదరాబాద్ లో 9013 లేన్ కిలోమీటర్ల విస్తీర్ణం గల రహదారులున్నాయి. వీటిలో 2846 కిలోమీటర్లలో బీ.టీ రోడ్లు ఉండగా, 6167 కిలోమీటర్ల సి.సి రోడ్లున్నాయి. ఈ రోడ్లలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
అనేక కిలోమీటర్ల రోడ్డులో పెద్ద గుంతలు ఏర్పడగా, కొన్ని రోడ్లయితే మొత్తమే కొట్టుకుపోయాయి. ఈ దెబ్బతిన్న రోడ్లను రెండు మూడు రోజుల వ్యవధిలోనే ప్రయాణానికి అనువుగా జీ.హెచ్.ఎం.సి జీహెచ్ఎంసి అధికారులు పునరుద్దరించారు. 
 
దెబ్బతిన్న రోడ్లనన్నింటినీ పునర్నిర్మించాలని, ప్యాచ్ వర్కులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టీ. రామారావు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో నగరంలో రోడ్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
నగరంలో జీహెచ్ఎంసీ నిర్వహణా పరిధిలో దెబ్బతిన్న 83 కిలోమీటర్ల రోడ్లలో ప్యాచ్ వర్కులను యుద్ధ ప్రాతిపదికపై చేపడుతున్నారు. ఈ ప్యాచ్ వర్కులకు చుడీ బజార్ లో ఉన్న బీ.టీ హాట్ మిక్సింగ్ ప్లాంట్ నుండి బీ.టీ.మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు.
 
జీహెచ్ఎంసీ నిర్వహించే రోడ్లలో 99 కిలోమీటర్ల రోడ్లను రూ. 52 కోట్ల వ్యయంతో పునర్నిమించే పనులు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు, సమగ్ర రహదారుల అభివృద్ధి పధకం (సీఆర్ఎంపీ ) క్రింద 83 కిలోమీటర్ల రహదారులలో మొదటి లేరును వేస్తున్నారు. ఇప్పటికే నగర పరిధిలో 273 కిలోమీటర్ల విస్తీర్ణంలో సి.సి. రోడ్ల నిర్మాణానికి రూ.204 .36 కోట్లు మంజూరయి ఉన్నాయి. 
 
వీటికి సంబంధించి 766 పనులకు టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ సి.సి.రోడ్లలో రూ.80 కోట్లతో వెంటనే సి.సి. రోడ్లనిర్మాణం వెంటనే చేపట్టాలని మంత్రి కె.టీ.ఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో పనులను ప్రారంభించే పక్రియను ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించారు.
 
నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చేపట్టిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణాలను జీహెచ్ ఎంసీ చేపట్టింది. మరో రూ. 298 కోట్ల వ్యయంతో అదనంగా బాక్స్ డ్రైయిన్లను చేపట్టేందుకై పరిపాలన సంబంధిత అనుమతులు జారీచేయడంతో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉంది. 
 
ఇక, హుస్సేన్ సాగర్ సికిందరాబాద్ మార్గంలో ఉన్న సర్ ప్లస్  నాలా అసంపూర్తి పనులను రూ. 68 కోట్లతో చేపట్టాలని మంత్రి ఆదేశించడంతో ఈ పనులను చేపట్టేందుకై ట్రాఫిక్ పోలీసుల అనుమతులు పొంది ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. 
 
రాబోయే పదిరోజులపాటు రోడ్ల పునరుద్ధరణ పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని రోజువారీ లక్ష్యాలతో పనులు చేపట్టాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నిర్వహణా విభాగం ఇంజనీర్లు అదే లక్ష్యంతో పనులు ప్రారంభించారు.
 
ఇటీవలి భారీ వర్షాలకు పాత బస్తీ లోని ఆజాంపురా వంతెన కూలి పోయింది దీనితో అక్కడి లక్షలాది మందికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే దీనికి స్పందించిన కె.టీ.ఆర్ ఈ వంతెన పునర్నిర్మాణం చేయడానికి రూ. 3 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 దీనిని కూడా చేపట్టేందుకు అంచనాల తయారీ, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. గ్రేటర్ లో ఉన్న చెరువుల్లో 192 చెరువులను ఇంజనీర్ల బృందం తనికీలు చేసింది. వీటిలో కొన్ని  చెరువులు పాక్షికంగా దెబ్బతినగా ఆరు చెరువులకు పూర్తిగా గండ్లు పడ్డాయి. 
 
వీటన్నిటికీ మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రూ. 41 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేసింది. వీటన్నింటితో పాటు నగరంలోని పాత ఫ్లయ్ ఓవర్లు, బ్రిడ్జి లను కూడా సమగ్ర తనికీ చేసి మరమాతులు వెంటనే చేయించాలని కె.టీ.ఆర్ పేర్కొనడంతో నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం