Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీధి కుక్క‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు: జిహెచ్‌ఎంసి

వీధి కుక్క‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు: జిహెచ్‌ఎంసి
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:02 IST)
వీధి కుక్క‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయ‌డానికి జిహెచ్ఎంసితో పాటు యానిమ‌ల్ వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్స్ ను ఆహ్వానించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది.

జిహెచ్‌ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 13 అంశాల‌ను చ‌ర్చించి ఆమోదించారు. 

ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు గంధం జోత్స్న, ముద్ర‌బోయిన శ్రీ‌నివాస‌రావు, జువేరి ఫాతిమా, మీర్ బాసిత్ అలీ, మిర్జా ముస్త‌ఫా బేగ్‌, సున్నం రాజ్‌మోహ‌న్‌, మ‌హ్మ‌ద్ న‌జీర్ ఉద్దీన్‌, మ‌హ్మ‌ద్ మాజిద్ హుస్సేన్, ముఠా ప‌ద్మ‌న‌రేష్‌, కొల‌ను ల‌క్ష్మి, టౌన్‌ప్లానింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి, సి.ఇ జియాఉద్దీన్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
           
స్టాండింగ్ క‌మిటీలో ఆమోదించిన ముఖ్య‌మైన తీర్మాణాలు...
*  విశ్రాంత ఉద్యోగి మ‌హ్మ‌ద్ గౌస్ మోయినుద్దీన్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ సేవలు సంవ‌త్స‌రం పాటు కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో నియ‌మించుట‌కు ఆమోదం.
 
* ఔట‌ర్ రింగ్‌రోడ్ స‌ర్వీసు రోడ్డు నుండి ఖాజాగూడ చెరువు వ‌యా ఉర్దు యూనివ‌ర్సిటీ వ‌ర‌కు 30 మీట‌ర్ల వెడ‌ల్పుతో రోడ్డు నిర్మించుట‌కు ఆమోదం.
 
* రూ. 6 కోట్ల వ్య‌యంతో తార్నాక లాలపేట్ వార్డులో వాలీబాల్ కోర్డు ప్రాంగ‌ణంలో మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్ హాల్ నిర్మించుట‌కు ఆమోదం.
 
* రూ. 41 కోట్ల‌తో ఖైర‌తాబాద్ జోన్ ప‌రిధిలో 13 థీమ్ పార్కులు అభివృద్దికి ఆమోదం.
 
* రూ. 2.98 కోట్ల‌తో వ్య‌యంతో ప‌టాన్‌చెరు & రామ‌చంద్ర‌పురంలో రైతుబజార్ నిర్మించుట‌కు ఆమోదం.
 
* హైటెక్‌సిటీ ఫేజ్ -2 నుండి గ‌చ్చిబౌలి ఇన్ఆర్బిట్ రోడ్ వ‌ర‌కు 12 మీట‌ర్ల రోడ్డు వెడ‌ల్పు ప‌నుల‌కు ఆమోదం.
 
* బి.ఎస్‌.ఎన్.ఎల్ ఆఫీస్ నుండి జిఎస్ఎం మాల్ మియాపూర్ మెయిన్‌రోడ్ వ‌ర‌కు 60 మీట‌ర్ల రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు ఆమోదం.
 
* రూ. 4.60 కోట్ల వ్య‌యంతో ద‌నియాల గుట్ట బేగంపేట్‌ హిందూ శ్మ‌శాన‌వాటిక ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు ఆమోదం.
 
*  స్పోర్ట్స్ / ప‌్లే మెటిరీయ‌ల్ కొనుగోలు చేయ‌డానికి ప్ర‌తివార్డుకు రూ. 1 ల‌క్ష నుండి రూ. 2 ల‌క్ష‌ల‌కు పెంచుట‌కు ఆమోదం.
 
* క్రీడ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన పూర్వ క్రీడాకారుల‌కు నెల‌స‌రి పింఛ‌ను ఇవ్వ‌డానికి ఆమోదం.
 
* వీధి కుక్క‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయ‌డానికి జిహెచ్ఎంసితో పాటు ఎనిమ‌ల్ వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్స్ కు  ఆహ్వానించుట‌కు (ఇ.ఓ.ఐ) ఆమోదం.
 
* ఎస్‌.ఆర్‌.డి.పి కింద ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్ నుండి బైరామ‌ల్‌గూడ జంక్ష‌న్ వ‌ర‌కు 60 మీట‌ర్ల వెడ‌ల్పుతో రోడ్డు విస్త‌ర‌ణ‌లో ఆస్తులు కోల్పోతున్న ఇద్ద‌రి య‌జ‌మానుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం.
 
* ఔట‌ర్ రింగ్‌రోడ్ స‌ర్వీసు రోడ్డు నుండి ఖాజాగూడ చెరువు వ‌యా ఉర్దు యూనివ‌ర్సిటీ వ‌ర‌కు 30 మీట‌ర్ల వెడ‌ల్పుతో రోడ్డు నిర్మించే మార్గంలో ఉన్న‌ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ స్థ‌లాన్ని సేక‌రించి, ప్ర‌త్యామ్నాయ స్థ‌లాన్ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి కేటాయించే ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరీక్షా హాలుకు వెళ్తున్నారా?.. అయితే ఒక్క నిముషం ఆగండి