Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విమోచన దినోత్సవం... కాషాయ తలపాగాలతో మహిళా కార్యకర్తలు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:37 IST)
bjp
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇవాళ బీజేపీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. 
 
భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాల రెపరెపల మధ్య, కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మహిళా కార్యకర్తలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
 
చార్మినార్ నుంచి పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ బౌక్‌లు దౌడు తీశాయి. సెప్టెంబర్‌ 17 సందర్భంగా హైదరాబాద్‌లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్‌ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ సర్కార్‌ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది. ఈ పోటా పోటీ కార్యక్రమాలతో ఎక్కడా ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments