Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లి జిల్లాలో షాకింగ్ న్యూస్: డెడ్ బాడీతో నాలుగు రోజులు...?

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (10:44 IST)
పెద్దపల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన చెల్లితో అక్క నాలుగు రోజుల పాటు కలిసి వున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో నివాసముండే శ్వేత నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. 
 
దీంతో అక్క స్వాతి బయట ఎవరికీ విషయం చెప్పకుండా, కనీసం అంత్యక్రియలు కూడా జరుపకుండా చెల్లి డెడ్‌బాడీతో నాలుగురోజుల పాటు జీవనం సాగించింది. 
 
నాలుగు రోజుల తర్వాత సోమవారం తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ వివరాలు సేకరించారు. కాగా, శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం తెలియాల్సి ఉంది.
 
అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్వాతి తన సోదరి అంత్యక్రియలు నిర్వహించకుండా శ్వేత మృతదేహం వద్దే ఉండిపోయింది. ఆమె మృతి గురించి ఇరుగుపొరుగు వారికి కూడా తెలియజేయలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
ఆరేళ్ల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్లు పేదరికం కారణంగా అంత్యక్రియలు చేయకుండా అమ్మమ్మ మృతదేహంతో జీవనం కొనసాగించారు. శవపరీక్ష నిమిత్తం శ్వేత మృతదేహాన్ని పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments