Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాటింగ్ సందేశాలు చూపిస్తానంటూ మహిళ బ్లాక్ మెయిల్, యువకుడు ఆత్మహత్య

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:50 IST)
పెద్దపల్లి‌ : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్‌(33) సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎస్సై ఉపేందర్‌రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్‌ ఫొటోగ్రాఫర్‌. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి.

ఈ క్రమంలో రమేశ్‌ నుంచి రమాదేవి రూ. 6 లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్‌ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్‌కాల్స్, చాటింగ్‌ సందేశాలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్‌లో రమేశ్‌పై కేసు పెట్టింది.
 
తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్‌ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్‌ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్‌ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments