Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్న దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌!..ఎక్కడ

Advertiesment
నగ్న దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌!..ఎక్కడ
, మంగళవారం, 23 మార్చి 2021 (10:45 IST)
భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలను ఆసరాగా చేసుకుని పోలీస్‌స్టేషన్‌లో న్యాయం చేస్తామని మభ్యపెట్టి తనపై ఇద్దరు అత్యాచారం చేశారని నరసరావుపేటలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ యువతి రూరల్‌ ఎస్పీని ఆశ్రయించారు.

కనపర్రు గ్రామానికి చెందిన మహిళకు 13 ఏళ్ల క్రితం నరసరావుపేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత భర్తతో విబేధాల కారణంగా ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు.

పెళ్లి సందర్భంగా పుట్టింటి వారు పెట్టిన బంగారంతో బయటకు రాగా ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావు తన వద్దకు వచ్చి భార్యభర్తల మధ్య గొడవ సర్దుబాటు చేస్తామని చెప్పారని తెలిపింది.

తన వద్ద ఉన్న బంగారం దాస్తానని 47 సవర్ల ఆభరణాలు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసేందుకు తాను నరసరావుపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి పరిచయమై  న్యాయం చేస్తానని తనను తీసుకెళ్లాడన్నారు.

తాను హోంమంత్రి బంధువునని చెప్పుకుంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతూ పంచాయితీలు చేస్తున్నాడన్నారు. శ్రీనివాసనగర్‌లో ఓ ఇల్లు  అద్దెకు తీసుకుని తనను అక్కడ ఉంచారన్నారు. అక్కడ తనపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్‌ నాయకుడు లైంగిక దాడి చేశారని పేర్కొంది.

అంతేకాక తన నగ్న వీడియోలు తీశారని తెలిపింది. రూరల్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని తనకు అన్యాయం చేయటమేకాక కాంగ్రెస్‌ నాయకుడిపై కేసు పెట్టకుండా చేశారన్నారు. వారిద్దరిపై తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమండ్రిని వణికిస్తోన్న కరోనా