Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో బీజేపీతో కలిసి అడుగులేయనున్న టీడీపీ?

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (11:27 IST)
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని విపక్షాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణలో పుంజుకోవాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది. 2018లో టీడీపీ తన చిరకాల భాగస్వామి బీజేపీని వదులుకుని, కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లింది. కానీ అది కలిసిరాలేదు. 
 
2018 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలుచుకుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ యోచిస్తోంది.
 
2022కి కట్ చేస్తే, 2023 తెలంగాణా ఎన్నికల్లో పార్టీ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుందని టీడీపీ నేతలు చెప్పారు. తాజాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాసాని జ్ఞానేశ్వర్‌ను కూడా నియమించింది. 
 
నెల రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుదని.. 200 మంది నేతలు ప్రస్తుతం సమావేశాలకు హాజరవుతున్నారని ఓ టీడీపీ నేత చెప్పారు.  
 
ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని టీడీపీ చెప్తోంది. తెలంగాణలో తమకు దాదాపు 5శాతం ఓట్ల వాటా ఉందని టీడీపీ పేర్కొంది. కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆంధ్రా ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మా ప్రణాళికలు సఫలమైతే అది కచ్చితంగా టీఆర్‌ఎస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఓ టీడీపీ నేత చెప్పారు.
 
ఇకపోతే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ మార్కును సాధించలేకపోయింది. 2018లో టీడీపీ తన చిరకాల భాగస్వామి బీజేపీని వదులుకుని కాంగ్రెస్‌తో కలిసి వెళ్లింది. 2018లో కాకుండా, 2014 తెలంగాణ ఎన్నికలలో పార్టీ 15 సీట్లు గెలుచుకోగలిగింది. అయితే బీజేపీ ఐదు స్థానాలను గెలుచుకుంది.  
 
ఇప్పుడు మరోసారి టీడీపీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? అనే దానిపై చర్చ మొదలైంది.ఇందుకు కాషాయ పార్టీ నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. టీడీపీ తెలంగాణ నేత జ్ఞానేశ్వర్ అంత శక్తిమంతమైన నాయకుడు కాకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే వైఆర్టీపీ- బీజపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments