Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి రోజు శ్వేతనాగు.. భక్తులను ఆశీర్వదిస్తూ..!

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (18:31 IST)
white snake
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు పోటెత్తారు. గురువారం మహాశివరాత్రి రోజున నాగుపాము కనిపిస్తే మంచిదని చెప్తుంటారు. ఇక శ్వేతనాగు కనిపిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని చెప్తుంటారు.

మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేతనాగు మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో కోర్టు సమీపంలోని ఓ ఇంటి ముందు కనిపించింది. శ్వేతనాగును చూసిన కాలనీ వాసులు మంత్రముగ్దులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు, గుడ్లు సమర్పించారు. పడగవిప్పి ఆ పాము భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది.
 
ఆ సమయంలో శ్వేత నాగు.. పాలు తాగడంతో పాటు భక్తులకు ఎలాంటి హాని చేయకపోవడం విశేషం. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకోవడంతో నాగుపాము భయపడింది. అక్కడున్న వ్యక్తులు స్నేక్ క్యాచర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments