Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?.. కేంద్ర మంత్రి పరిశీలన

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:00 IST)
వైద్యులు రేయింబవళ్లు కరోనా బాధితులకు సేవలందిస్తున్నప్పటికీ ఇటీవల కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం స్వయంగా పరిశీలించారు.

తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు..? వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయ్..? నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. పలు మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు చేశారు. 
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మొర:
ఆస్పత్రి వద్ద కేంద్రమంత్రిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ మొర వినిపించుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. అలాగే వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి ఉద్యోగులు వినతిపత్రం అందించారు.
14 ఏళ్ళుగా పనిచేస్తున్నా 15వేల జీతం మాత్రమే ఇస్తున్నారని కొత్తగా వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 29వేల వేతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి డ్యూటీలకు వస్తున్నామన్నారు. మాకంటే జూనియర్లు కింద మేము పనిచేయలేమని, సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం చెల్లించాలని మీడియా ముఖంగా వారు డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించటం భారంగా మారిందని.. తమ వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకామని గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments