Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దు.. కేంద్రమంత్రి విజ్ఞప్తి​

Advertiesment
పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దు.. కేంద్రమంత్రి విజ్ఞప్తి​
, శనివారం, 16 మే 2020 (16:00 IST)
పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దని, పబ్లిక్​ ప్లేసుల్లో ఉమ్మివేయడంపై బ్యాన్​ పెట్టాలని రాష్ట్రాలు, యూనియన్ టెరిటీరలను సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​ హర్షవర్థన్​ కోరారు.

కరోనా ఇన్ఫెక్షన్​ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్​, జార్ఖండ్​ సర్కార్లు వీటిని ఇప్పటికే బ్యాన్​ చేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అన్ని రాష్ట్రాల హెల్త్​మినిస్టర్లకు ఆయన లెటర్లు రాశారు.

పొగాకు వాడేవాళ్లు పబ్లిక్​ స్థలాల్లో ఉమ్మేస్తుంటారని, దీనివల్ల కరోనా వైరస్​లాంటివి వ్యాప్తిచెందడానికి అవకాశామున్నందువల్ల వాటి సేల్స్​ను ఆపేయాలని ఆయన ఆ లెటర్లో కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొగకు వాడకం పెద్ద థ్రెట్​ అని ఈనెల 11న రాసిన లెటర్లో హర్షవర్థన్​ గుర్తుచేశారు. పబ్లిక్​ప్లేసుల్లో పొగరాని పొగాకు ప్రొడక్ట్స్​ వాడొద్దంటూ ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రిసెర్చ్​ ( ఐసీఎంఆర్​) ఇప్పటికే జనానికి విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 నుంచి షార్‌లో కార్యకలాపాలు