Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు రూ.10 వేల కోట్లు వచ్చినా భరిస్తాం: కేసీఆర్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:41 IST)
సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ అదే కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తోందని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల బిల్లు వచ్చినా భరిస్తామని స్పష్టం చేశారు. ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్ సీఐకి అందించామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా మాదిరిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తున్నట్టు వివరించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తామని చెప్పారు.

రూ.10 వేల కోట్లతో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments