Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దెయ్యం' దెబ్బకు వరంగల్ నుంచి జీహెచ్ఎంసికి బదిలీ అయిన కలెక్టర్ ఆమ్రపాలి

దెయ్యం... దెయ్యం అంటూ ఈమధ్య ఆందోళన వ్యక్తం చేసిన వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలిని తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. ఆమె దెయ్యం అంటూ హంగామా చేయడంపై ప్రభుత్వం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐతే అదేమీ బయటకు చెప్పలేదు కానీ... బదీలీల్లో

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (20:56 IST)
దెయ్యం... దెయ్యం అంటూ ఈమధ్య ఆందోళన వ్యక్తం చేసిన వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలిని తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. ఆమె దెయ్యం అంటూ హంగామా చేయడంపై ప్రభుత్వం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐతే అదేమీ బయటకు చెప్పలేదు కానీ... బదీలీల్లో భాగంగానే ఆమ్రపాలిని వరంగల్ జిల్లా నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ చేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
 
ఇకపోతే కలెక్టర్ ఆమ్రపాలి... తన ఇంట్లో దెయ్యం వుందని తెలిపారు. ఆ దెయ్యమంటే తనకు భయమని.. అందుకే ఇంట్లో నిద్రించేందుకు సాహసించట్లేదని ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వివరాల్లోకి వెళితే.. వరంగల్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు పదో తేదీతో 133 ఏళ్లు నిండిన సందర్భంగా తాను నివాసం వుంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ.. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని  తెలిసిందన్నారు. ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో పరిశోధన చేయగా.. జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
 
గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి తెలిపారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే.. గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్‌గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు. అయినా సరే అక్కడ దెయ్యం ఉందన్న భయం తనను వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి సాహసించడం లేదని ఆమ్రపాలి అన్నారు. 
 
ఈ మొత్తం వ్యవహారం గత కొన్నిరోజులుగా నెట్లో హల్చల్ చేసింది. దీనితో ఆమెను వరంగల్ జిల్లా నుంచి జీహెచ్ఎంసీకి బదిలీ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments