Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవును.. నేనుండే ఇంట్లో దెయ్యం వుంది.. ఓ రోజు అలా జరిగింది: ఆమ్రపాలి

దెయ్యాలు వున్నాయంటే కొందరు అవునంటారు. మరికొందరు లేరంటారు. ఇంకొందరైతే దెయ్యాలంటే వున్నాయో లేవో తెలియకుండానే భయపడిపోతున్నారు. దెయ్యాల విషయంలో ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోలా వుంటాయి. తాజాగా వరంగల్ కలెక్టర్ ఆమ

అవును.. నేనుండే ఇంట్లో దెయ్యం వుంది.. ఓ రోజు అలా జరిగింది: ఆమ్రపాలి
, బుధవారం, 15 ఆగస్టు 2018 (09:54 IST)
దెయ్యాలు వున్నాయంటే కొందరు అవునంటారు. మరికొందరు లేరంటారు. ఇంకొందరైతే దెయ్యాలంటే వున్నాయో లేవో తెలియకుండానే భయపడిపోతున్నారు. దెయ్యాల విషయంలో ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోలా వుంటాయి. తాజాగా వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం వుందని తెలిసింది.


ఈ విషయాన్ని ఆమ్రపాలినే చెప్పారు. ఆ దెయ్యమంటే తనకు భయమని.. అందుకే ఇంట్లో నిద్రించేందుకు సాహసించట్లేదని ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి పునాది రాయి వేసి ఆగస్టు పదో తేదీతో 133 ఏళ్లు నిండిన సందర్భంగా తాను నివాసం వుంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి మాట్లాడుతూ.. అప్పట్లో ఈ భవనానికి జార్జ్ పామర్ భార్య శంకుస్థాపన చేశారని  తెలిసిందన్నారు. ఇంతకీ జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో పరిశోధన చేయగా.. జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు.
 
గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి తెలిపారు. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక ఓ రోజు మొదటి అంతస్తులోకి వెళ్లి చూస్తే.. గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్‌గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు. అయినా సరే అక్కడ దెయ్యం ఉందన్న భయం తనను వీడలేదని, అందుకే అక్కడ నిద్రపోవడానికి సాహసించడం లేదని ఆమ్రపాలి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోని పేదలకు ప్రధాని ఆయుష్మాన్ భవ... 72వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటన