Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...

ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష

Advertiesment
రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...
, మంగళవారం, 5 జూన్ 2018 (12:48 IST)
ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని జోలార్‌పేట జంక్షన్ సమీపంలో జరిగింది.
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... చెన్నైకు చెందిన కుటుంబీకులు కోయంబత్తూరు నుంచి చెన్నైకు చేరన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారు. ఈ రైలు సోమవారం తెల్లవారుజామున జోలార్‌పేట సమీపానికి వస్తుండగా, అదే రైలులో విధులు నిర్వహిస్తున్న రైల్వే టిక్కెట్‌ కలెక్టర్‌ అశ్విన్‌కుమార్‌ ఆ కుటుంబంలోని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు జోలార్‌పేట రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అశ్విన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ కామాంధుడుని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వేలూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారును మోసుకెళ్లిన ఆటో.. ఎక్కడ? ఫోటో చూడండి..