నీ యిష్టంతో నాకు పని లేదు.. నన్నే పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కిడ్నాప్ చేశాడు.. వైశాలి

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:59 IST)
నీ ఇష్టంతో నాకు పనిలేదు.. నువ్వంటే నాకు ఇష్టం.. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని బెదిరించిన నవీన్ రెడ్డి తనను కిడ్నాప్ చేశాడని దంత వైద్య విద్యార్థిని వైశాలి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
 
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో పలు ఆసక్తికర విషయాలు పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి, బాధితురాలి వైశాలికి వివాహం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైశాలి స్పందించారు. 
 
అతడితో తన పెళ్లి జరగలేదని స్పష్టం చేసింది. పైగా, అతడు పెళ్లి జరిగింది అని చెప్పిన రోజున తాను ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని వైశాలి వెల్లడించింది.
 
అతడితో తనకు బ్యాడ్మింటన్ ఆడే సమయంలో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తనకు ఇష్టంలేదని చెప్పి దూరం పెట్టానని తెలిపారు. కానీ, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బుచ్చిరెడ్డి ద్వారా తన తల్లిదండ్రులను సంప్రదించి పెళ్లి ప్రస్తావన చేయగా, తన తల్లిదండ్రులు కూడా అతడిని ఇష్టపడలేదని వైశాలి చెప్పింది.
 
ఆ తర్వాత తనను బెదిరించడం, వేధించడం మొదలు పెట్టాడని, పెళ్లి చేసుకోకపోతే తన జీవితం నాశనం చేస్తాని చెప్పి, ఇంటిపై దాడిచేసి బలవంతంగా లాక్కెళ్లాడని, కారులోనే తనను తీవ్రంగా కొట్టాడని బోరున విలపిస్తూ చెప్పింది. తాను చెప్పినట్టు వినకపోతే తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని వైశాలి ఆరోపించారు. నీ యిష్టంతో నాకు పని లేదు.. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవాడనికి వీల్లేదు అని బెదిరించాడని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

Winter: పూజా కార్యక్రమాలతో వింటర్ చిత్రం ప్రారంభం

దేవగుడి విజయం సాధించడం సంతోషంగా ఉంది - బెల్లం రామకృష్ణారెడ్డి

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో బరాబర్ ప్రేమిస్తా సినిమా ఉంటుంది .. చంద్రహాస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments