కేటీఆర్ తీరు సిగ్గుచేటు.. కేటీఆర్ పై ఉత్తమ్ ఆగ్రహం

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:49 IST)
ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లో కాంగ్రెస్‌ నేతలకు మంత్రి కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పడం సిగ్గుచేటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

కేటీఆర్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 4 రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ లోకి వెళ్లిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యురాలు బుజ్జీ, సర్పంచ్‌లు, మోతీలాల్‌, నాగలక్ష్మి జితేందర్‌రెడ్డి శనివారం తిరిగి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ సమక్షంలో సొంత గూటికి చేరారు.

భార్యాభర్తలైన జడ్పీటీసీ బుజ్జీ, సర్పంచ్‌ మోతీలాల్‌ను కిడ్నాప్‌ చేసి ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. తమకు ప్రాణభయం ఉందని బుజ్జీ, మోతీలాల్‌ చెబుతున్నారంటే రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలన్నారు. బెదిరించి, డబ్బులు ఇచ్చి కాంగ్రెస్‌ కార్యకర్తలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు.

ఎంతమంది టీఆర్‌ఎస్‌ నేతలు వచ్చినా హుజూర్‌నగర్‌లో పద్మావతిరెడ్డి గెలుపును ఆపలేరన్నారు. మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

గుత్తాపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, త్వరలోనే పూర్తి ఆధారాలతో గవర్నర్‌ను కలుస్తామన్నారు. సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్నను అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments