Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీలోకి కాంగ్రెస్‌ కీలకనేత!

Advertiesment
బీజేపీలోకి కాంగ్రెస్‌ కీలకనేత!
, సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:47 IST)
బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ(రాజ్యసభ) అనిల్‌లాడ్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలి కమలంలో చేరేందుకు సిద్దమయ్యారు.

అక్టోబరు 5 లేదా 6 తేదీల్లో బెంగళూరులో బీజేపీ నాయకులు శ్రీరాములు, యడ్యూరప్ప, సోమశేఖర్‌రెడ్డి ఇతర బీజేపీ పార్టీ నాయకుల సమక్షంలో పార్టీలో చేరునున్నట్లు అనిల్‌లాడ్‌ ఆంధ్రజ్యోతితో తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ముందు నుంచి కీలక రాజకీయ నాయకుడుగా అనిల్‌ కొనసాగారు.

బళ్లారి నగరం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి ఒక సారి గెలిచారు. ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా పార్టీ వీడడానికి కాంగ్రెస్‌ నాయకుల్లో ఉండే అంతర్గత విభేదాలే కారణం అని చెప్పారు.

గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ తరుపున నిలిచిన నన్ను ఓడిండేందుకు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబు లాంటి నాయకులు పనిచేశారన్నారని ఆయన ఆరోపించారు. కుటిల రాజకీయ నాయకులు ఉం డే పార్టీ లో ఉండడంకన్నా వేరే పార్టీలో చేరితే మం చిదనే ఉద్దేశంతో పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే పదవి అడ్డు పెట్టుకోవడంతో పాటు సీనియర్‌ నాయకుడుగా చెప్పుకునే కేసీ కొండయ్య, విజయనగరం ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడితే అసలు సత్తా బ యట పడుతుందన్నారు.
 
ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నా జిల్లాకు దక్కింది శూన్యం. జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులుగా చెప్పుకుని పార్టీలో ఎమ్మెల్సీ పదవి పొందిన కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్పలు జిల్లా కు ఏమి నిధులు తెచ్చి అభివృద్ది పనులు చేశారో చెప్పాలని అనిల్‌ ప్రశ్నించారు. కేవ లం సీనియర్లు పదవులు పొం దడడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
 
కాంగ్రె్‌సపార్టీలో ఉండి అనేక పదవులు పొందిన అనిల్‌లాడ్‌ ఉన్నట్లుండి పార్టీని వదిలి బీజేపీలో ఎందుకు చేరుతున్నట్లు... రా జకీయ లబ్దికోసమా? లేదా బీజేపీ చేస్తు న్న దాడులకు భయపడా? అనే చర్చలు కాం గ్రెస్‌ కార్యకర్తల్లో జోరుగా సాగుతున్నాయి.

కాంగ్రె్‌సపార్టీలో సీనియర్‌ నాయకుడు అయి న డికేశీపై బీజేపీ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెడుతున్నారనే ప్రచారం సా గుతుంది. ఇలాంటి సంఘటనలు తనపై కూడా జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో అనిల్‌లాడ్‌ ముందుగానే పార్టీని వదిలి వెళ్లిపోతున్నారా? అనే అనుమానం కాంగ్రెస్‌ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌ను ముంచెత్తిన వరదలు