Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసివ్వమనండి.. తర్వాత చూపిస్తాం మా తడాఖా : అసదుద్దీన్‌కు అమిత్ షా కౌంటర్!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (09:35 IST)
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు దేశం నుంచి వెళ్లగొట్టాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని ఒక్క ముక్క రాసివ్వమనండి.. తర్వాత మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అసదుద్దీన్ మాట్లాడుతూ, ఒకవేళ పాతబస్తీలో రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉంటే హోంమంత్రి ఏంచేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. వీటిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
రోహింగ్యాలను, బంగ్లాదేశీలను దేశం నుంచి వెళ్లగొట్టాలని అసదుద్దీన్ ఒవైసీని రాసివ్వమనండి... ఆ తర్వాత కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడండి అంటూ ధీటుగా బదులిచ్చారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాల అంశం పార్లమెంటులో ఎప్పుడు చర్చకు వచ్చినా వారికి ఎవరు మద్దతుగా నిలబడుతున్నారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు.
 
"నేనేదైనా చర్య తీసుకుంటే వీళ్లు పార్లమెంటులో రభస సృష్టిస్తారు. ఎంత బిగ్గరగా ఏడుస్తారో మీరు చూడలేదా? చెప్పండి వాళ్లకు... బంగ్లాదేశీలు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని రాసివ్వమనండి. నేను ఆ పని చేస్తాను. ఎన్నికలప్పుడు ఇలాంటి అంశాలు మాడ్లాడితే ఒరిగేదేమీ ఉండదు" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments