Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరసకు మామయ్య.. అయినా చాటింగ్ చనువు.. గర్భవతిని చేశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (16:08 IST)
మెదక్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ మామయ్య బంధుత్వంతో ఓ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన పంజారాజు అనే పాతికేళ్ల యువకుడు ఆటో నడుపుకుంటున్నాడు. 
 
తనకు వరసకు కోడలు అయ్యే 16బాలికతో చనువు పెంచుకున్నాడు. బంధువు కదా అని ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మరింత బరితెగించాడు. ఆ మైనర్ బాలికతో వాట్సాప్‌ చాటింగ్ చేస్తూ తన మాయ మాటలతో లొంగదీసుకున్నాడు.
 
మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని...పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి కాకుండానే మైనర్‌ బాలికను పలుమార్లు శారీరకంగా వాడుకోవడంతో ...ఆమె గర్భవతి అయింది. 
 
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెబితే ఏం చేస్తారోననే భయంతో రహస్యంగా ఉంచింది. అమ్మాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో పాటు శరీరంలో మార్పును గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది.
 
దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే నిజాంపేట పోలీస్‌ స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కంప్లైంట్ ఆధారంగా రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం