Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ చిక్కిన మందుగుమ్మలు(Video)

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (18:54 IST)
ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు మందుకొట్టిన ముద్దుగుమ్మలు. వీకెండ్‌లో ఆల్కహాల్ మత్తులో అమ్మాయిలు తాగి ఊగారు. పబ్బుల్లో పీకల్దాక తాగి కార్ల స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ చేస్తూ వస్తున్న యువతులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, ఫిలింనగర్ ప్రాంతాల్లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 
 
బంజారాహిల్స్‌కు చెందిన న్యాయవాది అలేఖ్య అనే యువతి పబ్బులో ఫుల్లుగా మందేసి.. టీ.ఎస్.09 బి.వి. టీ.ఆర్. 8312 నెంబర్ గల ఆడి కారు డ్రైవ్ చేసుకుంటూ డైమండ్ హౌస్ వైపునకు వస్తుండగా.. పోలీసులు ఆమె కారును ఆపారు. అలేఖ్యకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. బ్లడ్‌లో 121 పాయింట్ల ఆల్కహాల్ నిర్థారణైంది. దాంతో అలేఖ్యపై కేసు బుక్ చేశారు. ఆమె ఆడి కారును సీజ్ చేశారు. 
 
టోలిచౌకికు చెందిన మరో యువతి ఉష పబ్బులో ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేస్తూ ఫిలింనగర్లో పోలీసులకు పట్టుబడింది. ఉష అగర్వాల్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం 63 పాయింట్ల మోతాదుగా నిర్థారణ కావడంతో.. ఉషపై కేసు బుక్ చేసి.. కారును సీజ్ చేశారు. పట్టుబడ్డ యువతులకు భర్తల సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు పోలీసులు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ తనిఖీల్లో 20 కార్లు, 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments