Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి మరో ఇద్దరు నేతలు

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (08:39 IST)
మరో ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్‌లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పేసుకున్నారు.

అయితే తాజాగా తెలంగాణలో ఒకప్పుడు కీలక నేతలుగా ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీంద్రనాయక్ ఇద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో లక్ష్మణ్ భేటీ కానున్నారు.

లక్ష్మణ్‌తోపాటు ఢిల్లీకి రేవూరి, రవీంద్ర నాయక్ వెళ్తున్నారు. షా ఆధ్వర్యంలో పార్టీలో ఆ ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై తెలంగాణలో 35 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ నెల 17న మోదీ జన్మదినం సందర్భంగా.. 14 నుంచి 20 వరకు సేవా వారం కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోరాటం ఉధృతం చేయాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.

బీజేపీ బలం చూసి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తోందని మనోహర్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేసి పోరాడుతామని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments