తెలంగాణాలో ఏప్రిల్ 23న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (10:22 IST)
తెలంగాణాలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, ఏప్రిల్ 23వ తేదీన ఈ రాత పరీక్షను నిర్వహించనున్నారు. 
 
అలాగే, రిక్రూట్మెంట్‌లో భాగంగా, చివర అంకమైన మెయిన్స్ పరీక్షల తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12వ తేదీ నుంచి మెయిన్ ఎగ్సామ్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షల నిర్వహిస్తారు. 
 
ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోలీస్ పోస్టులకు ప్రధాన పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. 
 
ప్రస్తుతం ఫిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ ‌కొనసాగుతున్నాయి. ఇవి ఈ నెల 5 తేదీతో ఈ దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. అయితే, హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌పై త్వరలోనే వెల్లడించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments