Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్యకర్తల భుజాలపై ఎక్కి బారికేడ్లు దాటిన రేవంత్.. అరెస్టు చేసిన పోలీసులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (15:59 IST)
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. దీనికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అంబేద్కర్‌ విగ్రహం వైపు ర్యాలీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బయలు దేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇందిరా పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్నాచౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యకర్తల భుజాలపై ఎక్కి మరీ రేవంత్‌ రెడ్డి బారికేడ్లు దాటారు.
 
అటు బారికేడ్లను కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు తోసివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు మధు యాష్కీ, అంజన్ కుమార్‌ యాదవ్‌‌లను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇక అంతకు ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. గవర్నర్ అపాయింట్‌‌మెంట్‌ అడిగితే ఇవ్వలేదని… నిన్ను ఏమన్నా భోజనం పెట్టమని అన్నమా…? అని ప్రశ్నించారు. 
 
తెలంగాణ గవర్నర్, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నమ్మకం లేదని, కానీ, అంబేడ్కర్ మీద నమ్మకం ఉందన్నారు. అందుకే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి పోతామని రేవంత్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments