Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెలకు అన్నం పెట్టి అ.. ఆలు నేర్పింది సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:43 IST)
తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు గుడ్‌బై చెప్పిన ఈటల ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలకు అన్నం పెట్టి.. అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని.. కానీ కేసీఆర్ బతికుండగానే ఈటెల సీఎం కావాలని ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. 
 
ఈటెల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈటెల సీఎం కావాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు… ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగ అని ఈటెల అన్నారని హరీష్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో 100 శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. 
 
కాగా టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం హరీష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈటెలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈటెలపై స్వయంగా హరీషే ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments