Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి... ఢిల్లీ టూర్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (11:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్రంపై పోరాటానికి దిగనున్నారు. యాసంగి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
 
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావానికి అనుగుణంగా యాసంగిలో వరియేతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం ధాన్యాన్ని సేకరించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పింది. దీంతో తెరాస ఎల్పీ సమావేశంలో ఇదే అంశంపై ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 
 
అదేసమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శలు చేస్తున్నారు. అలాగే, రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది. ఇక తెరాస ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కలుసుకుని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments