వరంగల్ దగ్గరలో పులి సంచారం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:30 IST)
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పులి సంచరించిన వార్తలు కలకలం రేపాయి. తాజాగా వరంగల్ ఇలాఖాలో కూడా పులి పాద ముద్రల్ని అధికారులు గుర్తించారు.

మరోసారి పులి సంచరిస్తున్న వార్తలు వినవస్తున్నాయి వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల పరిధి పాకాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

పులి వెళ్లిన ప్రాంతంలో పాద ముద్రలను సేకరించి సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు పాకాల అటవీ ప్రాంతానికి వచ్చినట్లుగా గుర్తించారు. 

ఖానాపురం మండలంలోన బండమీది మామిడితండా శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోనికి వచ్చి ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి.

మొన్నటికి మొన్న మంచిర్యాల, కొమురంభీం జిల్లాలతో పాటు హైదరాబాదు నగర ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments