రోడ్డుపైకి పెద్ద పులి...ఎక్కడ?

బుధవారం, 15 జులై 2020 (08:56 IST)
మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ నేషనల్‌ పార్క్‌కు చెందిన పెద్దపులి ఒకటి పక్కనే ఉన్న ఏడో నెంబర్‌ జాతీయ రహదారిపైకి వచ్చింది. అక్కడనే ఉన్న ఫైఓవర్‌పై వచ్చి పడుకుంది.

చాలాసేపు అక్కడే ఉంది. దీంతో రోడ్డుపై ప్రయాణీస్తున్న వారు పెద్దపులికి దూరంగా వాహనాలు అపుకొని కూర్చుకున్నారు. ఒకవేళ పెద్దపులి తమపై దాడి చేస్తుందేమోనని కొంతమంది భయపడ్డారు.

కానీ అది మాత్రం కులసాగా అలాగే పడుకుండిపోయింది. ఎంతసేపటికీ పెద్ద పులి అక్కడ నుండి కదలకపోవడంతో వాహనాల్లో వచ్చిన ప్రయాణీకులు అటివీ అధికారులకు కబురు అందించారు. వారు ఇచ్చి తిరిగి పెద్ద పులిని పెంచ్‌ నేషనల్‌ పార్క్‌ లోకి పంపించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత...శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం