నడిరోడ్డుపై పెద్దపులి.. చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్న యువకులు

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:04 IST)
తెలంగాణలో పెద్దపులి కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని ఏటిగూడ వద్ద నడి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి అక్కడి వారి వెంటపడటం కలకలం రేపుతోంది. రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి.. ప్రయాణికులను, పాదచారులను వెంటాడింది.
 
పులి వెంబడించడంతో ఇద్దరు యువకులు పరుగు తీశారు. పులి నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదం తప్పడంతో బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరో ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆరుగురు వ్యక్తులు కమ్మర్గాం గుండె పల్లి గ్రామాల నుంచి బెజ్జూర్ మండల కేంద్రానికి వస్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పులి సంచారంతో అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు, గిరిజనులు హడలిపోతున్నారు. ఇక ఈ నెల 11న ఆసిఫాబాద్‌జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన 22 ఏళ్ల విఘ్నేష్‌పై పులి దాడి చేసి చంపేసింది.
 
ఆ పులిని పట్టుకునేందుకు 12 బృందాలు రంగంలోకి దిగాయి. అయినా ఇప్పటివరకు పెద్దపులి జాడ దొరకలేదు. ఆ పులి మహారాష్ట్ర అడవుల వైపు వెళ్లిపోయి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే తాజాగా మరో పులి మనుషులపై దాడికి భయాందోళనలకు దారి తీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: ఇట్లు అర్జున లో హాయ్ రే సాంగ్ మెస్మరైజింగ్ చేస్తుంది: నాని

Sandeep Kishan : సిగ్మా మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం : సందీప్ కిషన్, జేసన్ సంజయ్

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, సినీ నటుడు ఉపేంద్ర కర్నాటక సీఎం అవుతారా?

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

తర్వాతి కథనం
Show comments